తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను మధ్యాహ్నం 3 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారు. మార్చి 4 నుంచి 21 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. లాక్‌డౌన్ కారణంగా మార్చి 23 న జరగాల్సిన మోడరన్ లాంగ్వేజెస్, జాగ్రఫీ పరీక్షలు ఈ నెల 3న నిర్వహించారు.
నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇప్పటికే మార్కుల అప్‌లోడ్!
నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే మార్కుల అప్‌లోడ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
today-telangana-inter-results-release
గత నెల 11 నుంచి నెలాఖరు వరకు మూల్యాంకనం పూర్తి చేశారు. గత 15 రోజులుగా మార్కుల అప్‌లోడ్ ప్రక్రియ చేపట్టారు. గతేడాది సాంకేతిక లోపాలు తలెత్తిన నేపథ్యంలో ఈ ఏడాది ఫలితాల ప్రక్రియను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు అప్పగించారు. ఫలితాలు వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
ఇదీ చూడండి :భారత్- చైనా మధ్య సైనిక చర్చలు మళ్లీ జరిగేనా?