Tidco Houses : పేదలు నివసించాల్సిన గృహ సముదాయాలు ప్రస్తుతం గేదెలకు నీడగా మారాయి.వాటిలో కొన్ని చోట్ల పిచ్చిమొక్కలు, తీగలు పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలో పేదల కోసమని విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో టిడ్కో గృహాలు నిర్మించారు. గృహ సముదాయ పనులు తుది దశకు చేరుకున్నా.. ఇప్పటికీ అర్హులకు ఇవ్వకపోవడంతో స్థానికులు ఆ భవన నీడన పశువులను కట్టేసుకుంటున్నారు. రూ.కోట్లు వెచ్చించిన నిర్మాణాలు పూర్తిగా శిథిలం కాకముందే పాలకులు జోక్యం చేసుకొని పంపిణీ చేయాలని అర్హులు కోరుతున్నారు.
Tidco Houses : పేదల మేడ.. గేదెలకు నీడ!
పేదల కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకం చేపట్టిన టిడ్కో ఇళ్లు నేడు నిరుపయోగంగా మారాయి. ప్రస్తుత పాలకులు పట్టించుకోకపోవడంతో అవి పేదలకు దక్కడం లేదు. పేదలు ఉండాల్సిన గృహ సముదాయాలు గేదెలకు నీడనిస్తున్నాయి.
పేదల మేడ.. గేదెలకు నీడ!