తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పార్టీలోని అందరూ పాటుపడాలని ఎంపీ కేశినేని నాని సూచించారు. మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనతో ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.
మన కలలు మనమే సాకారం చేసుకోవాలి. మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం. అమరావతి అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు కన్న కల. అది సాకారం అవ్వాలంటే 2024 లో తెదేపా అధికారంలోకి రావాలి. ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి. మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటన వల్ల ప్రయోజనం లేదు- కేశినేని నాని, ఎంపీ