ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. పని చేసే వ్యక్తే నిందితుడు

నగల దుకాణంలో భారీ చోరీ... విజయవాడలో సంచలనం రేపింది. దుండగులు సుమారు 7 కేజీల బంగారం, రూ.42 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా వీడియో డీవీఆర్​ను కూడా మాయం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం ఐదు బృందాలతో గాలింపు చేపట్టారు. చివరకు షాపులో పనిచేస్తోన్న విక్రమ్​సింగ్​ అనే వ్యక్తే నిందితుడని పోలీసులు గుర్తించారు.

విజయవాడలో భారీ దోపిడీ... 7 కేజీల బంగారంతో పరారీ
విజయవాడలో భారీ దోపిడీ... 7 కేజీల బంగారంతో పరారీ

By

Published : Jul 24, 2020, 4:29 PM IST

Updated : Jul 24, 2020, 8:57 PM IST

విజయవాడలో సంచలనం కలిగించిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దుకాణంలో పనిచేస్తోన్న విక్రమ్​ సింగ్​ దోపిడీకి పాల్పడినట్లు సీపీ బత్తిని శ్రీనివాసులు తెలిపారు. బంగారం, వెండి, నగదు 2 బ్యాగుల్లో పెట్టుకుని వేరే చోట పెట్టి వచ్చాడని చెప్పారు. 7 కిలోల బంగారం, 19 కిలోల వెండి, రూ.42 లక్షలు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. బ్యాగుల్లో పెట్టిన సొత్తంతా రికవరీ చేసుకున్నామన్న ఆయన.. సీసీ కెమెరా దృశ్యాలతో మరిన్ని ఆధారాలు సేకరించామని వెల్లడించారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయ ఉందన్న అంశంపై విచారణ చేస్తున్నామని అన్నారు.

ఇలా జరిగింది

లాక్​డౌన్ కారణంగా వేరే ప్రాంతంలో ఉన్న దుకాణంలోని బంగారాన్ని వన్​టౌన్ కాటూరి వీధిలో సాయి చరణ్ జ్యూయలరీస్​లోకి మార్చారు. ఎవరైనా వినియోగదారులు వస్తే ఇక్కడ నుంచే నగలు తీసుకువెళ్లి చూపించి విక్రయిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో షాపు సిబ్బంది ఒకరు బంగారు ఆభరణాల కోసం వన్​టౌన్ దుకాణంలోకి వచ్చారు. అక్కడ దుకాణంలో పనిచేసే వ్యక్తి విక్రమ్ కట్టి పడేసి ఉండటం చూసి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలున్నాయి. నిందితులు వీడియో రికార్డ్ అయ్యే డీవీఆర్​ను మాయం చేశారు.

విక్రమ్​పై అనుమానంతో

దుకాణంలో పనిచేసే వ్యక్తి విక్రమ్​ పొంతన లేని సమాధానాలు చెపుతుండడంతో పోలీసుల అతన్ని ప్రశ్నించారు. చివరకు అతనే నిందితుడిగా తేల్చారు.

ఇదీ చదవండి:

పోస్టులు పెట్టినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు: హైకోర్టు

Last Updated : Jul 24, 2020, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details