ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'చికిత్స' అనంతరం.. ఇకపై నెలకు రూ.5 వేలు ఆర్థికసాయం

By

Published : Nov 29, 2019, 2:03 PM IST

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అనంతరం అందించే ఆర్థిక సాయాన్ని.. నెలకు 5 వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది.

YSR Health Scheme
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం... దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలవారికి చెల్లించే ఆర్ధిక సాయంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రోజుకు 225 రూపాయల చొప్పున... నెలకు గరిష్టంగా 5 వేల చెల్లింపు చేసేందుకు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి చికిత్స అనంతరం అందించే ఆర్ధిక సాయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. మొత్తం 26 విభాగాల్లో 836 శస్త్రచికిత్సలకు ఈ ఆర్ధిక సాయాన్ని వర్తింపచేయాలని నిర్ణయించారు. నెలలో గరిష్టంగా 5 వేల రూపాయల చెల్లిస్తామని.. రోజుకు 225 రూపాయల చొప్పున 22 రోజులకు ఈ ఆర్ధిక సాయం అందుతుందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల్లో పేర్కోన్నారు. సాయం పొందేందుకు చికిత్స చేయించుకున్న రోగులు బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డు వివరాలు సమర్పించాలని సూచించారు. ఏడాదిలో ఒక్కసారికే ఈ ఆర్ధిక సాయం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.

ABOUT THE AUTHOR

...view details