ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రైతులపై అట్రాసిటీ కేసులో.. దర్యాప్తు నివేదిక దాఖలు చేయండి' - investigating officer should file a report on the case against farmers

రాజధాని ప్రాంత రైతులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపిన వ్యవహారంలో... దర్యాప్తు అధికారి నివేదిక దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరికొంత గడువిస్తూ విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

The investigating officer should file a report on the case against the capital farmers says highcourt
రాజధాని రైతులపై కేసు వ్యవహారంలో దర్యాప్తు అధికారి నివేదిక దాఖలు చేయాలి: హైకోర్టు

By

Published : Nov 21, 2020, 7:11 AM IST

రాజధాని ప్రాంత రైతులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపిన వ్యవహారంలో... దర్యాప్తు అధికారి నివేదిక దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరికొంత గడువిస్తూ విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులుగా నిందితుల అరెస్ట్ విషయమై మంగళగిరి పోలీసులు దిగువ న్యాయస్థానంలో వేస్తున్న రిమాండ్ రిపోర్ట్ ప్రతుల్ని కోర్టుకు సమర్పించాలని డీఎస్పీని ఆదేశించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రాజధాని ప్రాంత రైతులు ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయంపై... హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. పోలీసులు, సంబంధిత న్యాయాధికారులు నివేదికలు సమర్పించాలని బెయిలు మంజూరు సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. దర్యాప్తు అధికారి నివేదిక సమర్పణకు మరికొంత సమయం కావాలని సీపీ అభ్యర్థించగా... న్యాయమూర్తి అంగీకరించారు.

ABOUT THE AUTHOR

...view details