రెండు నెలల్లో ఉద్యోగులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడ జరగడంలేదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు. తెదేపా హయంలో ఉద్యోగ భద్రత ఉంటే...వైకాపా ప్రభుత్వ హయంలో భద్రత లేదని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు అందరకీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పాదయాత్రలో ఆచరణ సాధ్యం కాని హామీలు జగన్ ఇవ్వడం వల్లే నేడు ఆందోళనలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. ఏళ్ల నుంచి చేస్తున్న ఉద్యోగాలు తీసేసి..ఇప్పుడు కొత్తవారికి ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.
'ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళనప్రదేశ్గా మార్చేశారు'
రెండు నెలల్లో ఉద్యోగులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తప్ప ఎక్కడ జరగడంలేదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు.
తెదేపా ఎమ్మెల్సీ