బ్యారేజీ గేట్ల దగ్గర ఇరుక్కున్న పడవ తొలగింపు - prakasam barriage
ప్రకాశం బ్యారేజీ 68వ గేటు వద్ద ఇరుక్కుపోయిన పడవను నిపుణుల బృందం బయటకు తీసింది. కృష్ణా వరదల సమయంలో కొట్టుకు వచ్చిన ఇది బ్యారేజీ గేట్ల మధ్య చిక్కుకుంది.
విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద కొద్ది రోజులుగా అడ్డంకిగా మారిన పడవను ఎట్టకేలకు బయటకు తీశారు. నిపుణుల బృందం ఎంతో శ్రమించి దీనిని బయటకు తీసింది. ఈ పడవ ఇసుక తరలించేందుకు వాడేదిగా అధికారులు గుర్తించారు. అయితే దీని యజమాని ఎవరనేది తెలుసుకునేందుకు నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా వరదల సమయంలో కొట్టుకువచ్చిన ఈ పడవ గేట్ల మధ్యలో ఇరుక్కుపోయింది. దాదాపు 30 అడుగుల పొడవున్న ఈ పడవ అడ్డుగా ఉండటంతో ఇన్ని రోజులు గేటు మూయటం సాధ్యం కాలేదు. దీనిని బయటకు తీయటంతో అధికారులు బ్యారేజీ గేట్లు మూసి నీటిని విడుదలను ఆపేశారు.