జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై ఉన్న కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వాన్‌పిక్ ఓడరేవుకు భూకేటాయింపుల్లో అక్రమాలు, క్విడ్ ప్రొకో జరిగిందంటూ దాఖలైన ఛార్జ్ షీట్ నిందితుల జాబితాలో వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సీబీఐ చేర్చింది. వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భూసేకరణ జరిగిందని సీబీఐ పేర్కొంది. అయితే సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది.
వాన్పిక్పై కేసు కొట్టివేత.. తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై ఉన్న కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇదేకేసులో నిందితుడిగా ఉన్న పరిశ్రమల శాఖ అప్పటి ప్రత్యేక కార్యదర్శి, మాజీ ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిని కేసు నుంచి తొలగించేందుకు ఇటీవల నిరాకరించిన హైకోర్టు.. కోర్టులో విచారణకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది.
సీబీఐ అభియోగాల్లో వాస్తవం లేదని వాన్‌పిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వాదించగా... అభియోగాలకు తగిన ఆధారాలున్నాయని సీబీఐ పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు వాన్ పిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదేకేసులో నిందితుడిగా ఉన్న పరిశ్రమల శాఖ అప్పటి ప్రత్యేక కార్యదర్శి, మాజీ ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిని కేసు నుంచి తొలగించేందుకు ఇటీవల నిరాకరించిన హైకోర్టు... కోర్టులో విచారణకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. నిమ్మగడ్డ ప్రసాద్ తదితరుల డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగులో ఉన్నాయి.
ఇవీ చూడండి