ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరపండి: తెదేపా - రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన తెదేపా నేతలు

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ... తెదేపా నేతలు కళా వెంకట్రావు, అశోక్​బాబు, మంతెన సత్యనారాయణరాజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు వినతిపత్రం అందజేశారు. పోలీసు, పంచాయతీరాజ్ వ్యవస్థలను వైకాపా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాల అభ్యర్థులను భయపెడుతున్నారని ఫిర్యాదు చేశారు.

tdp leaders meets states election officer
రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు వినతిపత్రం అందజేసిన తెదేపా నేతలు
author img

By

Published : Mar 5, 2020, 1:45 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు వినతిపత్రం అందజేసిన తెదేపా నేతలు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ... తెలుగుదేశం నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యాలయాలు, నీటి ట్యాంకులు, విద్యుత్తు స్తంభాలకు ఉన్న వైకాపా రంగులపై... కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఓటర్లపై ప్రభావం చూపుతాయని.. వాటిని మార్చాలని కోరారు. ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details