ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బడ్జెట్ పెట్టలేని ప్రభుత్వం ప్రజలకేం మేలు చేస్తుంది‌: యనమల

ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఓటాన్ అకౌంట్​ బడ్జెట్​ను ప్రవేశపెట్టారని ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కరోనా, ఎన్నికల సాకు చెప్పి తప్పించుకుంటున్నారని.. బడ్జెట్ పెట్టలేని ప్రభుత్వం ప్రజలకేం మేలు చేస్తుందని ప్రశ్నించారు.

tdp leader yanamala comments on vote on account budget
యనమల రామకృష్ణుడు

By

Published : Mar 29, 2021, 7:52 PM IST

Updated : Mar 29, 2021, 8:52 PM IST

ఆర్డినెన్స్ పేరుతో రెండేళ్లు బడ్జెట్ దాటవేశారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. బడ్జెట్ పెట్టలేని ప్రభుత్వం.. ప్రజలకేం మేలు చేస్తుందని నిలదీశారు. వైకాపా బడ్జెట్ పెట్టడంలో ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ తెచ్చేంత దుర్భర పరిస్థితులు ఏమున్నాయన్నారు. ఆర్డినెన్స్​తో బడ్జెట్ తీసుకురావడం వైకాపా దుర్మార్గానికి నిదర్శనమన్నారు. గతేడాది కరోనా, ఇప్పుడు ఎన్నికల సాకుగా చూపి తప్పించుకుంటోందని ధ్వజమెత్తారు.

ఈ ఏడాది 14 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టాయని, రోజు వారీ ఖర్చుల కోసం ఓటాన్ అకౌంట్ ఆమోదించుకునే ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాగ్ నివేదిక ప్రకారం ఫిబ్రవరిలో 5వేల కోట్లు అప్పు చేశారని, ఒక ఏడాదిలో రూ. 80వేల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. అప్పులు, వడ్డీల కోసం పన్నులు, ధరలతో ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్నారని, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఓటాన్ అకౌంట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని యనమల ఆక్షేపించారు.

Last Updated : Mar 29, 2021, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details