ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Varla ramaiah: గుడివాడలో అక్రమ మైనింగ్ చెలరేగుతోంది.. మంత్రి పెద్దిరెడ్డికి వర్ల రామయ్య లేఖ - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ

Varla ramaiah letter to minister peddireddy: మాజీ మంత్రి కొడాలి నాని బహిరంగ మద్దతుతో.. కృష్ణా జిల్లా గుడివాడలో అక్రమ మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని.. తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆర్‌ఐ అరవింద్ పై దాడి జరిగినా.. మైనింగ్ అధికారులు మాఫియాపై చర్యలు తీసుకోకుండా రెవెన్యూ అధికారులతో రాజీ కుదిర్చారని మండిపడ్డారు. దోషులను శిక్షించాలని లేఖ ద్వారా మంత్రిని కోరారు.

varla ramaiah
వర్ల రామయ్య

By

Published : Apr 23, 2022, 9:21 AM IST

Varla ramaiah letter to minister peddireddy: కృష్ణా జిల్లా గుడివాడలో మైనింగ్ మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన ఆర్.ఐ అరవింద్ పై దాడి ఘటనపై.. గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. మాజీ మంత్రి కొడాలి నాని బహిరంగ మద్దతుతో.. గుడివాడలో అక్రమ మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని ఆరోపించారు.

ఆర్‌ఐపై దాడి జరిగినా మైనింగ్ అధికారులు మాఫియాపై చర్యలు తీసుకోకుండా రెవెన్యూ అధికారులతో రాజీ కుదిర్చారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి గనులు శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోకపోవడం చాలా భయంకరమన్నారు. మీ ఆశీస్సులతోనే రాష్ట్రంలో విచక్షణారహితంగా అక్రమ మైనింగ్‌ కొనసాగుతోందన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని తెలిపారు.

ఆర్.ఐ అరవింద్‌పై దాడి చేసిన దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా మంత్రిని విజ్ఞప్తి చేశారు. దోషులపై సత్వర కటిన చర్యలు మాత్రమే అక్రమ మైనింగ్ మాఫియాను అరికట్టి ప్రకృతి మాతను రక్షించడంలో సహాయపడుతుందని వెల్లడించారు.

ఇదీ చదవండి:రేషన్‌ బియ్యానికి బదులు నగదు...నూరుశాతం వ్యతిరేకిస్తున్న కార్డుదారులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details