తెదేపా వాళ్లే రామచంద్రపై దాడిచేశారని చెప్పడం ద్వారా ఎస్పీ, ఒక రాజకీయపార్టీకి కొమ్ముకాస్తున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కుమార్ రెడ్డి, మరో ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డిని రక్షించడం కోసం.. ఎస్పీ స్థాయిలో ఉన్నవ్యక్తి, మీడియా ముందు ప్రతాపరెడ్డి తెదేపా వాడని చెప్పడం ఎంతవరకు న్యాయమో చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాస్తే అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి, డీజీపీతో కలిసి దళితులపై జరుగుతున్న దారుణాలపై సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు.
ఆయన తెదేపా వ్యక్తి అని చెప్పేందుకు ఆధారాలేంటి?.. : వర్ల రామయ్య
రామచంద్రపై జరిగిన దాడి కేసులో తెరపైకి తీసుకొచ్చిన ప్రతాప్‌రెడ్డి తెదేపా వాడని చెప్పటానికి పోలీసులు వద్ద ఉన్న ఆధారాలేంటని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిలదీశారు. మంత్రి పెద్దిరెడ్డి సోదరుడైన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అనుచరులతో కలిసి ప్రతాప్ రెడ్డి పనిచేస్తున్నాడని తెలిపారు.
tdp leader varla ramaiah comments on police