'80 శాతానికి పైగా గెలిచామంటూ వైకాపా అసత్య ప్రచారం'
సర్పంచ్ ఎన్నికల్లో 80 శాతానికి పైగా వైకాపా మద్దతుదారులు గెలిచారని ఆ పార్టీ కార్యకర్తలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెదేపా కార్య నిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆరోపించారు. జగన్కు అంత ప్రజాబలం ఉందని భావిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాతీర్పు కోరాలని పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు 80 శాతానికి పైగా గెలిచారని ఆ పార్టీ కార్యకర్తలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెదేపా కార్య నిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం దుయ్యబట్టారు. జగన్కు అంత ప్రజాబలం ఉందని భావిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాతీర్పు కోరాలన్నారు. భయపెట్టి ఓట్లు సాధించకుండా.. భరోసాతో ప్రజల మద్దతు కూడగడితే ఎవరి బలమెంతో తేలిపోతుందని స్పష్టం చేసారు. అరవై శాతానికి పైగా వైకాపా మంత్రుల సొంత గ్రామాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారని బ్రహ్మం పేర్కొన్నారు.