ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది' - వైకాపా బెదిరింపులపై ఎస్​ఈసీకి తెదేపా ఫిర్యాదు

తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను అధికార వైకాపా బెదిరిస్తోందని ఎస్​ఈసీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.

tdp complaint against ycp
ఎస్​ఈసీకి తెదేపా ఫిర్యాదు

By

Published : Apr 15, 2021, 9:13 PM IST

వైకాపా బెదిరింపులపై ఎస్​ఈసీకి తెదేపా ఫిర్యాదు

తిరుపతి ఉపఎన్నికలో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పార్టీ నేతలు, కార్యకర్తలను బెదిరిస్తున్నారంటూ... ఓజిలి, వాకాడు, ఏర్పేడు పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేశారు.

స్థానిక సీఐ, ఎస్సైలను ఎన్నికల విధులనుంచి తప్పించాలని సీఈఓకు ఫిర్యాదు చేసినట్టు ఎమ్మెల్సీ అశోక్ బాబు వెల్లడించారు. సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, వాలంటీర్లు ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా చూడాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details