రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న ముఖ్యమంత్రి జగన్కు... క్రికెట్ అవసరమా అని ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. టెస్టు, వన్డేల్లో మొదటి రెండు స్థానాల్లో భారత జట్టు రాణిస్తుండగా ప్రస్తుతానికి టీమిండియాకు జగన్ రెడ్డి అవసరం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులు, ప్రజలు, నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ జరిగింది..
పాలనలో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. బ్యాట్పట్టి రెండు బంతులు ఆడి అభిమానులను అలరించారు. కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో సీఎం జగన్ క్రికెట్ బ్యాట్ పట్టారు. వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి.. ఫ్లడ్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సరదాగా బ్యాటింగ్ చేశారు. ఎంపీ అవినాష్ బౌలింగ్ చేయగా.. రెండు బంతులు ఆడి అభిమానుల్ని అలరించారు. బ్యాట్, బంతిపై సీఎం జగన్ సంతకం చేశారు.
ఇదీచదవండి.