TDP Atchannaidu on ys jagan: "ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సామాజిక న్యాయ విద్రోహి" అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. 56 కార్పొరేషన్లు, 10 మంత్రి పదవుల పేరుతో ప్లీనరీలో తీర్మానం పెట్టడం దారుణమన్నారు. కార్పొరేషన్లతో మూడేళ్లలో ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. ఎస్సీల అసైన్డ్ భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, ఉపాధి హక్కుల్ని కాలరాసి.. ఎస్సీలను అణగదొక్కడం నిజం కాదా? అని ప్రశ్నించారు. అన్ని రకాల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించడమేనా.. సామాజిక న్యాయం? అని నిలదీశారు. 10 మందికి పదవులిచ్చి వేల మందిని హత్య చేయడం దారుణమన్నారు. మన్యంలో చంద్రబాబు కాఫీతోటలు పెంచితే.. జగన్ గంజాయి తోటలు పెంచారని ఎద్దేవా చేశారు.
సామాజిక న్యాయ విద్రోహి.. జగన్ : అచ్చెన్న - సీఎం జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్
Atchannaidu on ys jagan : అన్ని రకాల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించడమేనా సామజిక న్యాయం? అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. వైఎస్ జగన్ సామాజిక న్యాయ విద్రోహి అని అచ్చెన్నాయుడు విమర్శించారు. 56 కార్పొరేషన్లతో మూడేళ్లలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
tdp atchannaidu
"మైనార్టీ సంక్షేమ నిధులు రూ.1,483 కోట్లు దారి మళ్లింపు వాస్తవం కాదా..? దుల్హన్, రంజాన్ తోఫా, దుకాన్ మకాన్ ఎందుకు ఆగాయి..? ఇస్లామిక్ బ్యాంకు హమీపై మాట తప్పడం మైనార్టీ ద్రోహం కాదా జగన్ రెడ్డీ. పదిమందికి పదవులిచ్చి వేల మందిని హత్య చేయడం, దళితులకు బొరుగులు పెట్టి.. వారి బంగారం కొట్టేయడం.. సామాజిక న్యాయమా?" అని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చదవండి: YCP Plenary: వైకాపా జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక