ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుర్గమ్మ సన్నిధిలో స్వరూపానంద స్వామి - swamy

విజయవాడ కనకదుర్గమ్మను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వామి వారికి ఘన స్వాగతం పలికారు.

దుర్గమ్మ సన్నిధిలో స్వరూపానంద స్వామి

By

Published : Jun 14, 2019, 5:20 PM IST

Updated : Jun 14, 2019, 8:29 PM IST

దుర్గమ్మ సన్నిధిలో స్వరూపానంద స్వామి

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ ఈవో ఘనంగా స్వాగతం పలికారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కృష్ణా తీరంలో శారదా పీఠం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామని స్వామి వారు తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాలు, లోక కల్యాణం, మంచి వర్షాలు కురవాలని యజ్ఞం చేపడుతున్నామన్నారు.

దీక్షా స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి...
విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ దీక్షా స్వీకార మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లి కృష్ణానది తీరంలో ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో విశాఖ శ్రీ శారదాపీఠ శంకరాచార్య శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు శిష్యసన్యాసాశ్రమ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. రేపు సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధస్నానాలు, కూష్మాండ, పురుషసూక్త హోమాలు, 16న సన్యాసాంగ అష్టశ్రాద్ధాలు, వాక్యార్థ మహాసభలు, 17న బాలస్వామికి యోగపట్టా అనుగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి రానున్న ప్రముఖులు..
చివరి రోజు కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్​తో పాటు ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ముగ్గురు ముఖ్యమంత్రులు రానున్ననేపథ్యంలో గణపతి సచ్చిదానందాశ్రమంలో భారీ ఏర్పాట్లు చేశారు. యాగాలకు ప్రత్యేక సభాస్థలిని తయారు చేశారు. గుంటూరు ఐజీ ఆర్కే మీనా ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇదీచదవండి

కేంద్ర మంత్రికి బెదిరింపు... తర్వాత ఏం జరిగింది?

Last Updated : Jun 14, 2019, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details