వలస కూలీలు, కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం నేత బాబూరావు డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా పనుల్లేక, తినడానికి ఆహారం లేక ఇబ్బంది పడుతున్న పశ్చిమ్‌బంగ వలస కూలీల దుస్థితిపై సీపీఎం, సీఐటీయూ నేతలు స్పందించారు. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి మాత్రమే భోజనం పంపిణీ చేస్తామన్న అధికారుల మాటలపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారు.. పశ్చిమ్‌బంగ నుంచి వచ్చిన వలస కూలీలతో కలిసి విజయవాడ పటమట ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వలస కూలీలు, కార్మికులకు బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నేతలు అన్నారు. వలస కూలీలకు ప్రభుత్వం 7500 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని సీపీఎం నేత బాబూరావు డిమాండ్ చేశారు.
'వలస కార్మికులకు రూ.7500 ఇవ్వాలి' - corona lockdown news
రాష్ట్రంలో ఉన్న పశ్చిమ్‌బంగాకు చెందిన వలస కూలీలు, కార్మికులకు సీపీఎం, సీఐటీయూ నేతలు అండగా నిలిచారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
state government has to provide financial assistance to migrant Migrant workers