కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎస్వీబీసీ ఛైర్మన్
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను ఎస్వీబీసీ ఛైర్మన్, ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.