ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు... రేపు గాజులోత్సవం నిర్వహించనున్నారు. గర్భగుడిలోని అమ్మవారితో పాటు అన్ని ఉపాలయాలు, దేవతా మూర్తులు, ఆలయ ప్రాంగణాన్ని గాజులతో అలంకరించనున్నారు. ఘనంగా నిర్వహించే ఉత్సవం కోసం భక్తులు అమ్మవారికి గాజులు సమర్పిస్తున్నారు. గాజులను అమ్మవారి సేవకులు దండలుగా సిద్ధం చేస్తున్నారు. మహామండపం ఆరవ అంతస్తులో గాజుల ఉత్సవానికి సంబంధించి అలకారం కోసం గాజుల దండల తయారీలో మహిళాభక్తులు నిమగ్నమయ్యారు. మంగళవారం ఇంద్రకీలాద్రి మొత్తం గాజులతో కళకళలాడనుంది.
ఇవీ చదవండి