సంస్కృత భాష ప్రాచీనమైనదే కాకుండా దేశంలోని అన్ని భాషలకు మూలమని ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి వ్యాఖ్యానించారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర సంస్కృత అధ్యాపకుల సంఘం సమావేశంలో పాల్గొన్న ఆమె.. సంస్కృత భాషను ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషగా పరిగణిస్తారని తెలిపారు. ఆధునిక భారతంలో సంస్కృత భాషను మర్చిపోకుండా అధ్యాపకులు కృషి చేస్తున్నారని, మూడు లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు సంస్కృత భాషను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరస్వతి హోమం నిర్వహించగా... కమిషనర్ హోమానికి పూర్ణాహుతి చేశారు. అనంతరం సంఘం ప్రతినిధులు ఆమెను ఘనంగా సత్కరించారు.
సంస్కృతం.. అన్ని భాషలకు మూలం: ఉదయలక్ష్మి - inter board
దేశంలో ఉన్న అన్నిభాషలకు సంస్కృభాష మూలమని ఇంటర్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి వ్యాఖ్యనించారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర సంస్కృత అధ్యాపకుల సంఘం సమావేశంలో పాల్గొన్న ఆమె సంస్కృతభాష ప్రాచీనమైన భాషగా పేర్కోన్నారు.
ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి