SAJJALA ON CPS ISSUE: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ను యథాతథంగా రద్దు చేస్తే దాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. సాంకేతిక అంశాలేవీ తెలుకోకుండా సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారని సజ్జల వెల్లడించారు. అధికారులు రిటైరైన తర్వాత లబ్ది చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఈ మేరకు హామీ ఇచ్చారని చెప్పారు.
SAJJALA ON CPS ISSUE: సాంకేతిక అంశాలు తెలీకే సీఎం సీపీఎస్ రద్దు హామీ ఇచ్చారు: సజ్జల
SAJJALA ABOUT CPS: సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీపీఎస్ రద్దుపై సాంకేతిక అంశాలపై అవగాహన లేకనే హామీ ఇచ్చారని సజ్జల వివరించారు. తమ ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చాక ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాల కోసం సీపీఎస్ రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ఉన్న అవకాశాలపై రెండు మూడు ఆప్షన్లను అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు అనేది ఎవరో అడిగితే తీసుకున్న నిర్ణయం కాదని.. ఉద్యోగులు అడిగినందునే వారి ప్రయోజనం కోసమే అప్పట్లో హామీ ఇచ్చినట్లు వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినట్లుగానే సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు సీఎం జగన్ ప్రయత్నస్తున్నారని సజ్జల అన్నారు. ఉద్యోగులకు గరిష్ఠంగా సంతృప్తి చెందేలా సీపీఎస్ రద్దుపై నిర్ణయం ఉంటుందని.. సీపీఎస్ రద్దుపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తప్పక నెరవేరుస్తారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:Sajjala On Fitment to Govt Employees: సీఎస్ కమిటీ సిఫారసు చేసిన ఫిట్‌మెంట్ పెంచే అవకాశం: సజ్జల