విభజన కారణంగా ఇప్పటికే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. ఇలాంటి సమయంలో రాజధాని మార్పుతో మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకులు మేడా శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టవద్దని శ్రీనివాస్ కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన, 13 జిల్లాల అభివృద్ధికి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
'రాజధాని మార్పుతో రాష్ట్రం నష్టపోతుంది' - విజయవాడలో అమరావతిపై రౌండ్ టేబుల్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టవద్దని ప్రభుత్వానికి సూచించారు.
విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం