దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాటానికి సంఘీభావం తెలుపుతూ... విజయవాడలో పారిశ్రామిక, కార్మిక సంఘాల నాయకులు ఆటో నగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్రప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలంటూ విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టారు. యునైటెడ్ ముస్లిం మైనార్టీ ఫోర్స్ ఆధ్వర్యంలో రమేష్ ఆస్పత్రి కూడలి వద్ద జాతీయ రహదారిపై వాహన చోదకులకు గులాబీలు పంపిణీ చేశారు.