'తెదేపాతో పొత్తు లేదు' - congress
ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అనుసరించి ఫిబ్రవరి నెలాఖరుకి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామన్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి.
raghu
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 7 నుంచి 10వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఏ పార్టీని ఓడించానికో , గెలిపించడానికో పోటీచేయడం లేదని వెల్లడించారు. ఆంధ్రాలో తెదేపాతో పొత్తు లేదన్న విషయం రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారన్నారు.
మీడియా సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి