రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో బీసీ, ఓసీల అర్హత మార్కులు 5 నుంచి 10 శాతం వరకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయంతో మిగిలిన 47 వేల పోస్టుల్లో 25 వేల వరకూ భర్తీ అవుతాయని అధికారుల అంచనా వేస్తున్నారు. లక్షా 26 వేల 728 సచివాలయ ఉద్యోగాల్లో... మిగిలిపోయిన పోస్టుల భర్తీ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది. దీనివల్ల ఆయా కేటగిరీల్లోని పోస్టులన్నీ దాదాపుగా భర్తీ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
బీసీ, ఓసీ అభ్యర్థుల అర్హత మార్కులు తగ్గించాలన్న డిమాండ్‌పై నియమించిన నిపుణుల కమిటీ … ఇటీవలే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు నివేదిక ఇచ్చిందని సమాచారం. ఇప్పటివరకు బీసీలకు 35 శాతం, ఓసీ లకు 40 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. వీటిని 5 నుంచి 10 శాతానికి తగ్గించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ... ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనల్లో సిఫార్సు చేయబోతోంది.
గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఓ వాలంటీరు చొప్పున లక్షా 92 వేల 964 మందిని నియమించేందుకు ఈ ఏడాది ఆగస్టు 1న ఉత్తర్వులిచ్చింది. కానీ ప్రస్తుతం లక్షా 83 వేల 290 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన 9 వేల 674 గ్రామ వాలంటీర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబరు 1న జిల్లాల వారీగా ప్రకటన జారీ చేసి 30 లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. డిసెంబరు 1 నుంచి వాలంటీర్లు విధులకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను సర్కారు ఆదేశించింది.
పదో తరగతి ఉత్తీర్ణులై కనిష్ఠంగా 18 ఏళ్లు కలిగి … 2019 నవంబరు 1 నాటికి 35 ఏళ్లు వయసు దాటని వారంతా వాలంటీరు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. ఆన్‌లైన్‌లో నిర్దేశించిన గ్రామ పంచాయతీకి చెందిన వారు మాత్రమే వాలంటీర్లుగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎంపీడీవో, తహసీల్దారు, పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి ఈవోతో ఏర్పాటైన కమిటీ … దరఖాస్తు చేసుకున్న వారికి ముఖాముఖి నిర్వహించి ఎంపిక చేస్తుంది.
అర్హత మార్కులు తగ్గించే అవకాశం ఇదీచదవండి మెట్రో నగరాల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు