వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలల్లోనూ వర్తింపచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా నగరాల్లోని ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు పొందేందుకు వీలుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని సవరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో... రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు పొందేందుకు అవకాశం కలగనుంది.
ఆరోగ్య మిత్రల నియామకం
17 అంశాల్లో 716 వైద్య చికిత్సలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం చేయించుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవయవమార్పిడి ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, పీడీయాట్రిక్ సర్జరీలతో సహా 17 అంశాల్లో వైద్య చికిత్సలు చేసుకోవచ్చని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మూడు నగరాల్లో సూపర్ స్పెషాలిటీ చికిత్సల కోసం పలు ఆసుపత్రులను గుర్తించి వాటిని ఎన్లిస్ట్ చేసేందుకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్టుకు బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా 71 మంది ఆరోగ్య మిత్రలతో పాటు ముగ్గురు కార్యాలయ సిబ్బంది, ముగ్గురు జిల్లా స్థాయి సమన్వయకర్తలను పొరుగు సేవల ద్వారా నియమించుకునేందుకు ఆదేశాలు వెలువడ్డాయి.
ఇదీ చదవండి :