గన్నవరం సర్కిల్ పరిధిలోని తేలప్రోలులో విజయవాడ తూర్పు ఏసీపీ విజయపాల్, సీఐ శివాజీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఎటువంటి ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు సుమారు 4 గంటల పాటు తనిఖీలు చేశారు.
గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు తేలప్రోలు అడ్డాగా మారింది. పోలీసుల ఆకస్మిక నిర్బంధ తనిఖీలతో స్థానికంగా వాతావరణం ప్రశాంతంగా మారే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు. విజయవాడ నగర శివారు వాంబే కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కాలనీలో ఇటీవల కొత్తగా జీ ప్లస్ త్రీ అపార్ట్మెంట్లో వచ్చిన కుటుంబాలను అజిత్ సింగ్ నగర్, నున్న పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు.