ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్లు హరిబాబు, దత్తాత్రేయకు జనసేన అధినేత పవన్‌ శుభాకాంక్షలు - Bandaru Dattatreya latest news

మిజోరాం రాష్ట్ర గవర్నర్​గా నియమితులైన హరిబాబు, హరియాణా గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో వారి వంతు పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Best wishes to the new Governors
గవర్నర్లకు కల్యాణ్‌ శుభాకాంక్షలు

By

Published : Jul 6, 2021, 5:43 PM IST

Updated : Jul 6, 2021, 5:48 PM IST

మిజోరాం రాష్ట్ర గవర్నర్​గా కంభంపాటి హరిబాబు నియమితులు కావడం సంతోషకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హరిబాబుకి తన తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా విద్యార్థులను తీర్చిదిద్ది.. ప్రజా ప్రతినిధిగా విశాఖ నగర అభివృద్ధికి ప్రశంసనీయమైన సేవలు అందించారని ప్రశంసించారు. ఓ ప్రజా పతినిధిగా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాలపై దృష్టిపెట్టారని.. మిజోరాం అభివృద్ధిలో హరిబాబు అనుభవం ఎంతో దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

గవర్నర్లు హరిబాబు, దత్తాత్రేయకు శుభాకాంక్షలు

దత్తాత్రేయ విలువైన సేవలు

హరియాణా గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయకు పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితంలో విశేష అనుభవం ఉన్న దత్తాత్రేయ ఇప్పటి వరకూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి విలువైన సేవలు అందించారు. ఇక హరియాణా రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తారని నమ్మకం ఉందన్నారు.

ఇదీ చదవండి..

మిజోరాం గవర్నర్​గా హరిబాబు- దత్తాత్రేయ బదిలీ

Last Updated : Jul 6, 2021, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details