Pawan kalyan: వైకాపాపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వరుస ట్వీట్లు సంధిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా పేర్కొంటూ పవన్ ట్వీట్ చేశారు. ఏపీని కూడా 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రా'గా ప్రకటించండని పవన్ అన్నారు. 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులకు వెళ్లండని ఎద్దేవా చేశారు. ఏపీని వైకాపా రాజ్యంగా మార్చుకోండని దుయ్యబట్టారు. దయచేసి సంకోచించకండి, సంకోచించకండంటూ మాట్లాడారు. సర్వతోముఖాభివృద్ధికి మంత్రం వికేంద్రీకరణ అనుకుంటే 3 రాజధానులే ఎందుకని ప్రశ్నించారు.
ఏది ఏమైనా వైకాపా చట్టానికి అతీతంగా ఉన్నట్లు విశ్వసిస్తారు, ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. మిగిలిన పౌరులు ఏం భావిస్తున్నారో ఒక్క పైసా కూడా పట్టించుకోరని ధ్వజమెత్తారు. యూఎస్‌ఏ దక్షిణ డకోటాలోని మౌంట్ రష్‌మోర్ చిత్రాన్ని పవన్ ట్వీట్‌లో ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ-విశ్వాసాలకు మౌంట్ రష్‌మోర్ చిహ్నంగా అభివర్ణన ఉందన్నారు. రుషికొండలో ఉన్న ఈ మౌంట్ దిల్ మాంగే మోర్ 'ధన-వర్గ-కులస్వామ్యానికి' చిహ్నంమని పవన్ తెలిపారు.