పురపాలక ఎన్నికల్లో నామినేషన్లు వేశాక చనిపోయిన అభ్యర్థుల స్థానాల్లో మళ్లీ నామినేషన్లు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. నామినేషన్లు వేశాక గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన 56 మంది అభ్యర్థులు మృతి చెందారని ఎస్ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులు మృతిచెందిన చోట మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 28 మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. నామినేషన్ల ఉహసంహరణకు మార్చి 3 వరకు గడువు విధించగా..మిగతా ప్రక్రియ యథాతథంగా ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
పార్టీల వారీగా చనిపోయిన అభ్యర్థులు
వైకాపా -28
తెదేపా -17
భాజపా -5