రాష్ట్రంలో జరిగే ఎన్నికలపై ప్రవాసాంధ్రులు స్పందించారు. 11న జరిగే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా చూడాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఒక ప్యానెల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతికి ప్రవాసాంధ్రులు రాసిన లేఖలోని ముఖ్యాంశాలు...
1) ఆంధ్రప్రదేశ్లో పారదర్శకంగా,స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
2) ఎన్నికల సంఘం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. అకారణంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సహా ఇతర ప్రభుత్వాధికారులను బదిలీ చేస్తోంది.
3) తెదేపా అభ్యర్థులు, పార్టీకీ అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలపై జరుగుతున్న ఐటీ దాడుల చేసి... భయ కంపితులను చేస్తోంది.
4) వివిప్యాట్ స్లిప్లు పూర్తిగా లెక్కించాలి.
పారదర్శక ఎన్నికల కోసం గళమెత్తిన ప్రవాసాంధ్రులు
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా జరిపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రవాసాంధ్రులు నినదించారు. ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ రాశారు.
పారదర్శక ఎన్నికల కోసం... రాష్ట్రపతికి ప్రవాసాంధ్రుల లేఖ.
ఇదీ చదవండి.... హక్కులపై మాట్లాడేవాళ్లు.. బాధ్యతలు ఎలా మరిచారు: శివాజీ