ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Recruitment in Medical Department: వైద్యారోగ్యశాఖలో 11,425 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

వైద్యారోగ్యశాఖలో 11,425 పోస్టుల భర్తీకి ప్రభుత్వం వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర నోటిఫికేషన్ విడుదల చేశారు.

వైద్యారోగ్యశాఖలో 11,425 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
వైద్యారోగ్యశాఖలో 11,425 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

By

Published : Nov 17, 2021, 10:38 PM IST

Updated : Nov 18, 2021, 6:28 AM IST

వైద్యారోగ్యశాఖలో నియామకాల భర్తీ(recruitment in medical department) కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11,425 పోస్టుల భర్తీకి వేర్వేరు ప్రకటనలు(notifications) విడుదల చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ వైద్య విధాన పరిషత్​లో 2,520 ఖాళీలు, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖలో 2,918 ఖాళీల భర్తీ కోసం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలోని లో-సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టు గ్రేడ్ 1,2, టెక్నీషియన్ల నియామకాలను భర్తీ చేయనున్నారు. కొన్ని విభాగం నుంచి పదోన్నతుల ద్వారా, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, శానిటరీ అటెండర్, వాచ్​మెన్, ఎఫ్ఎన్ఓలకు సంబంధించిన 1,285 పోస్టులను కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

వైఎస్ఆర్ అర్బన్ క్లీనిక్​లలో మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు కలిపి 560 మందిని కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోధనాసుపత్రులు, వైద్యవిద్యా కళాశాలల్లో భర్తీ చేయనున్న 1,952 మంది సిబ్బందిలో 282 అసిస్టెంటు ప్రోఫెసర్లు మినహా మిగతా పోస్టులను కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వీటితో పాటు బోధనాసుపత్రుల్లో 2,190 అదనపు పోస్టులను భర్తీ చేసేందుకూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదీ చదవండి.

Last Updated : Nov 18, 2021, 6:28 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details