ఇదీ చదవండి:
'అమ్మఒడి కాదు.. కోతల ఒడి పథకం' - అమ్మఒడి పథకం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది అమ్మఒడి కాదని.. కోతల ఒడి పథకమని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. ఇతర కార్పొరేషన్లకు సంబంధించిన 3,432 కోట్ల రూపాయలు అమ్మఒడి పథకానికి మళ్లించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలోని ఒక బిడ్డకే పథకం వర్తింపజేయడం సరికాదని... కచ్చితంగా పిల్లలందరికీ ఈ పథకం వర్తింపచేయాలని రామానాయుడు డిమాండ్ చేశారు. అమ్మఒడి పథకం అమలులో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పారని ధ్వజమెత్తారు.
'అమ్మఒడి పథకం కాదు.. కోతల ఒడి పథకం'