ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎమ్మెల్సీ దీపక్​రెడ్డికి కరోనా నెగెటివ్ ఉన్నా.. పాజిటివ్ అని ఎలా చెప్తారు?'

కరోనా పరీక్షల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ మండిపడ్డారు. ఎమ్మెల్సీ దీపక్​రెడ్డికి కరోనా నెగెటివ్ ఉన్నా... పాజిటివ్​గా రిపోర్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

nara lokesh on corona tests in andhrapradesh
nara lokesh on corona tests in andhrapradesh

By

Published : Jun 24, 2020, 8:26 PM IST

ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కరోనా టెస్టు చేసి పాజిటివ్ వచ్చిందని, క్వారంటైన్​కు రమ్మని హడావుడి చేశారని నారా లోకేశ్ వెల్లడించారు. దీపక్ రెడ్డి హైదరాబాద్​లో రెండుసార్లు ఆర్టీపీసీఆర్​ పరీక్ష చేసుకుంటే రెండుచోట్ల నెగటివ్ వచ్చిందని.. తన ట్విట్టర్​లో పోస్ట్ చేశారని లోకేశ్ అన్నారు.

ఎమ్మెల్సీ విషయంలోనే ఇలా ఆటలాడితే, ప్రజలతో ఇంకెన్ని ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరీక్షల్లో ఏమిటీ నిర్లక్ష్యమని నిలదీశారు. జగన్ పారాసెటమాల్ మాటలు చెప్పినట్టే యంత్రాంగం కరోనా టెస్ట్​​లను ఆషామాషీగా చేస్తుందా? అని సందేహం వస్తుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. పాజిటివ్ అని నిర్ధరణ చేసుకోకుండా తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని క్వారంటైన్​లో పెట్టడానికి చేసిన హడావుడి చూస్తే... ప్రభుత్వం ఇంకెదైనా కుట్ర చేసిందా? అని అనుమానాలు వస్తున్నాయని లోకేశ్ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు.. వైకాపా షోకాజ్ నోటీసు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details