Lokesh on Ambedkar Status issue in konaseema District: కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను ఘోరంగా అవమానించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఇదేంటని నిలదీసిన దళిత యువకులపై దారుణమైన సెక్షన్లతో కేసులు నమోదు చేయడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్ చెప్పారు. గోపాలపురంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో అంబేడ్కర్ ఫోటోలున్న పేపర్ ప్లేట్లలో ఆహార పదార్థాలు అందిస్తూ, బాబాసాహెబ్ ఫొటోలను ఎంగిలి డబ్బాలలో వేస్తున్నారన్నారు. దానికి సంబంధించిన ఫొటోలను లోకేశ్ ట్వీట్ చేశారు.
అంబేడ్కర్‌కు ఘోర అవమానం.. నిందితులపై చర్యలు తీసుకోండి : లోకేశ్
కోనసీమ జిల్లా గోపాలపురంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను ఘోరంగా అవమానించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఈ అవమానంపై నిలదీసిన యువతని అరెస్టు చేశారని మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అన్యాయన్ని ప్రశ్నించినందుకు 19 మంది దళిత యువకులపై 120బీ సెక్షన్ కింద కేసులు నమోదు చేసి, జైలులో బంధించడం రాష్ట్రంలో దళితులపై సాగుతున్న దమనకాండకు నిదర్శనమని మండిపడ్డారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. ప్రశ్నించిన యువతని అరెస్టు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దమనకాండ సాగిస్తూ.. కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ.. జగన్ రెడ్డి వికృతానందం పొందుతున్నారని లోకేశ్ విమర్శించారు. దళిత యువత భవితను నాశనం చేసే ఇటువంటి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. బేషరతుగా యువకులపై కేసులు ఎత్తేసి, వారిని జైలు నుంచి విడుదల చేయడంతోపాటు అంబేడ్కర్‌ని అవమానించిన వారిని శిక్షించాలని చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:'ఆ అమ్మాయితో లవ్‌లో ఉన్నా..' తన ప్రేమ గురించి చెప్పిన విశాల్