రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరిగేదెప్పుడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయవాడ యువతి హత్య ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన...ప్రేమోన్మాది చేతిలో అమాయకురాలు బలవటం దారుణమని మండిప్డడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదని ట్వీటర్ వేదికగా ధ్వజమెత్తారు. వరుస ఘటనలు జరుగుతున్నా...ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వారం రోజుల వ్యవధిలోనే అరడజనుకు పైగా ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ముఖ్యమంత్రి జగన్ మౌనం వహించటం సరికాదన్నారు. చట్టరూపం దాల్చని దిశ చట్టం, ఆర్భాటంగా ప్రారంభించిన పోలీసు స్టేషన్లు, అధికారంలేని హోమంత్రి రాష్ట్రంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరిగేదెప్పుడు: లోకేశ్ - విజయవాడ ఘటనపై లోకేశ్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ముఖ్యమంత్రి జగన్ మౌనం వహించటం సరికాదన్నారు. విజయవాడ యువతి హత్య ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన...ప్రేమోన్మాది చేతిలో అమాయకురాలు బలవటం దారుణమని మండిప్డడారు.
మహిళలకు న్యాయం జరిగేదెప్పుడు