ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించవద్దని గవర్నర్‌కు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ లేఖ రాశారు. యనమల పంచ్‌లకు, లా పాయింట్లకు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక.. మంత్రులకు బీపీ పెరుగుతోందని ఎద్దేవా చేశారు.
యనమలను.. మంత్రులు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ మేధావిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే.. ఎమ్మెల్సీలను అవమానించినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు.