దసరా నాటికి చక్కెర ఫ్యాక్టరీలల్లోని ఉద్యోగుల జీతాలు చెల్లింపునకు(pay arrears of sugar industries employees) ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. చెరకు రైతుల బకాయిల చెల్లింపునకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చెరకు ఫ్యాక్టరీల సమస్యలపై వర్చువల్‌గా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం.. వివిధ అంశాలను చర్చించింది. హైకోర్టు తీర్పుతో చెరకు రైతులకు మేలు జరిగిందని మంత్రి మేకపాటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్టోబర్ 5న నిర్వహించనున్న చక్కెర టెండర్ ప్రక్రియపై మంత్రి(group of ministers on ministers sugar industries) ఆరా తీశారు.
చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీ(sugar industries)ల ఉద్యోగుల జీతాల బకాయిలపై మంత్రి వర్గ ఉపసంఘం ప్రత్యేకంగా చర్చించింది. ఈ అంశాలపై సీఎంతో భేటీ అనంతరం మరోమారు సమావేశం కావాలని మంత్రుల కమిటీ అభిప్రాయపడింది. చక్కెర పరిశ్రమ డైరెక్టర్, కమిషనర్‌తోపాటు ఒ ఉన్నతాధికారిని నియమించి చక్కెర అమ్మకాలల్లో వేగం పెంచాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.