ఇంద్రకీలాద్రికి మంత్రి వెల్లంపల్లి
శాకంబరీ ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రికి ఆలయ ఈవో స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లు చేశారు.
శాకంబరి ఉత్సవాలకు అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. శాకంబరీ ఉత్సవాలకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కోటేశ్వరమ్మ తెలిపారు.