గ్రామ స్వరాజ్య సాధన, ప్రభుత్వ సేవలను ప్రజానీకానికి చేరువ చేసేందుకే గ్రామ గ్రామాన సచివాలయ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. గుడివాడ మండలం కల్వపూడి అగ్రహారంలో 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
తొలుత గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామ పెద్దలు, వైకాపా నాయకులు పూలమాలలతో ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి.. అనంతరం ఎంపీడీవో రమణ తో కలిసి సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.