ఎస్సీలకు జగన్ రెడ్డి చేసిన మోసాలను గ్రహించి తిరుపతి ఎన్నికలో వైకాపాకు బుద్ధి చెప్పాలని మాజీమంత్రి జవహర్ ఓటర్లను కోరారు. ముఖ్యమంత్రికి సేవ చేసినందుకే గురుమూర్తికి టికెట్ ఇచ్చారే తప్ప పేదలను ఉద్ధరించడానికి కాదని విమర్శించారు. చనిపోయిన దుర్గాప్రసాద్ భార్యకు, కుమారుడికి ఎంపీ సీటు ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా కోసమే నందిగం సురేశ్‌ను ఎంపీ చేశారని ఆరోపించారు. అమరావతి చుట్టుపక్కల ఉన్న 2 లక్షల మంది ఎస్సీలను బికారులుగా చేయటం దళిత ఉద్ధరణా అని నిలదీశారు. జగన్‌రెడ్డి మాటలు విని మోసపోవడానికి ఎస్సీలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
'జగన్‌కు సేవ చేసినందుకే తిరుపతి టికెట్ ఇచ్చారు' - తెదేపా నేత జవహర్ తాాజా వార్తలు
జగన్‌కు సేవ చేసినందుకే గురుమూర్తికి వైకాపా టికెట్ ఇచ్చారు తప్ప.. పేదల ఉద్ధరణకు కాదని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా వారిని మోసం చేశారన్నారు.
'జగన్‌కు సేవ చేసినందుకే తిరుపతి టికెట్ ఇచ్చారు'