ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీల సీఈవోలతో మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశం - మంత్రి గౌతమ్ రెడ్డి సీఎక్స్​వో సదస్సు

కరోనా అనంతర పరిస్థితులు, పరిణామాలను అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలపై.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీల సీఈవోలతో మంత్రి గౌతమ్ రెడ్డి.. సీఎక్స్​వో సదస్సు నిర్వహించారు. అమెజాన్, ఫేస్‌బుక్, సామ్‌సంగ్, గూగుల్‌ క్లౌడ్ తదితర కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

minister gowtham reddy meeting with it and electronics companies ceo's
ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీల సీఈవోలతో మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశం

By

Published : Apr 2, 2021, 3:42 PM IST

ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీల సీఈవోలతో.. సీఎక్స్​వో సదస్సు నిర్వహించారు. కరోనా అనంతర పరిస్థితులు, పరిణామాలను అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఐటీ సంస్థల సలహాలు, సూచనలు తెలుసుకోవడం కోసం కంపెనీ సీఈవోలతో.. మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అమెజాన్, ఫేస్‌బుక్, సామ్‌సంగ్, గూగుల్‌ క్లౌడ్, ఫ్లాక్స్‌కాన్, హెచ్‌టీసీ, ఫుజి, మోర్గాన్‌ స్టాన్లీ తదితర కార్పొరేట్ సంస్థల ప్రతినిధుల హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details