ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్​ కోతలు లేకుండా చూస్తాం: మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి

Balineni Srinivas: విద్యుత్​ వినియోగం పెరగనున్న నేపథ్యంలో కోతలు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి అన్నారు. అవసరమైన చోట్ల విద్యుత్​ను కొనుగోలు చేసి మరీ.. సరఫరా చేస్తామన్నారు.

Balineni Srinivas
మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి

By

Published : Mar 16, 2022, 1:25 PM IST

Balineni Srinivas: వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరగనున్న తరుణంలో రాష్ట్రంలో ఎక్కడా కోతలు లేకుండా చూస్తామని ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్​ను కొనుగోలు చేసైనా... సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

నిధుల సమస్య లేకుండా ఆర్థికశాఖకు.. సీఎం తగిన సూచనలు చేశారని అన్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి మంజూరైన సబ్‌స్టేషన్లలో మూడింటి పనులు ప్రారంభమయ్యాని మంత్రి వెల్లడించారు. దేవినగర్‌ వద్ద విద్యుత్​ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.



ఇదీ చదవండి:విద్యార్థుల తల్లుల ఖాతాల్లో.. రూ.709 కోట్లు జమచేసిన సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details