ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మెప్మా పీడీలు వారధిగా ఉండాలి'

నవరత్నాల అమలు, ప్రభుత్వ లక్ష్యాలపై మెప్మా పీడీలకు ఆ సంస్థ ఎండీ చిన తాతయ్య మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాలని సూచించారు.

మెప్మా పీడీ

By

Published : Jul 12, 2019, 12:24 AM IST

నవరత్నాల అమలులో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పాత్ర అనే అంశంపై 13 జిల్లాలకు చెందిన మెప్మా పీడీలతో....ఆ సంస్థ ఎండీ చిన తాతయ్య విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రభుత్వం లక్ష్యాలు, మెప్మా అనుసరించాల్సిన విధానాలపై పీడీలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మెప్మా ప్రణాళికలను సైతం పీడీలకు వివరించారు. గత ఏడాది అనుసరించిన విధానాలు....వాటి ద్వారా సాధించిన విజయాలు, పథకాలు అమలు చేయడంలో ఎదురైన ఇబ్బందులను సైతం సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పీడీలు కృషి చేయాలని.....ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మెప్మా వారధిగా ఉండాలని ఆయన సూచించారు.

మెప్మా పీడీలకు దిశానిర్దేశం

ABOUT THE AUTHOR

...view details