ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైద్య విద్య ప్రవేశాల్లో కౌన్సెలింగ్​కు నోటిఫికేషన్ విడుదల

By

Published : Nov 13, 2020, 8:18 PM IST

వైద్య విద్య ప్రవేశాల్లో కౌన్సెలింగ్​కు మార్గం సుగమం అయ్యింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో రిజర్వేషన్ కేటగిరి విద్యార్ధుల స్లైడింగ్​కు సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. నేటి నుంచి 8 రోజుల వరకు విద్యార్ధులు ఆన్ లైన్​లో తమ ధ్రువపత్రాలను పొందుపరుచుకోవచ్చని ఎన్టీఆర్ వర్శిటీ వీసీ తెలిపారు.

mbbs councilling notification release
వైద్య విద్య ప్రవేశాల్లో కౌన్సిలింగ్​కు నోటిఫికేషన్ విడుదల

వైద్య విద్య ప్రవేశాల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో రిజర్వేషన్ కేటగిరి విద్యార్ధుల స్లైడింగ్​కు సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్​ను విడుదల చేశారు.

నేటి నుంచి 8 రోజుల వరకు విద్యార్ధులు ఆన్ లైన్​లో తమ ధ్రువపత్రాలను పొందుపరచాలి. ఈనెల 13 నుంచి 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్ధులు అన్ లైన్​లో తమ ధ్రువపత్రాలను పొందుపరుచుకోవచ్చని వర్శిటీ తెలిపింది. అనంతరం వాటిని పరిశీలించి వారం రోజుల్లోగా మెరిట్ ఆధారంగా కళాశాలలను కేటాయిస్తామని ఎన్టీఆర్ వర్శిటీ వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.

రిజర్వేషన్ విద్యార్ధి ఓపెన్ కేటగిరి సీటు సంపాదించి స్లైడింగ్​లో మరో కళాశాలను ఎంచుకుంటే ఖాళీ అయిన సీటును సంబంధిత రిజర్వేషన్ కేటగిరిలోని మెరిట్ అభ్యర్థికి కేటాయిస్తామని వీసీ తెలిపారు. మొదటి కౌన్సెలింగ్​లో కోరుకున్న కాలేజీలో సీటు రాని విద్యార్ధులు నీట్​కు వెళతారు. ప్రస్తుతం 18వ తేదీ వరకు నీట్​ను పొడిగించారని మరో 15 రోజులు పొడిగించాలని ఎన్​ఎంసీకి లేఖ రాసినట్లు వీసీ తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా కౌన్సెలింగ్ ప్రక్రియ అంతా ఆన్ లైన్​లో చేయాలని వర్శిటీ అధికారులు నిర్ణయించారు. 17 వేల మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకునే అవకాశమున్నట్లు వర్శిటీ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి..

16న సీఎం జగన్​కు కోర్టు ధిక్కరణ నోటీసులు: రఘురామ

ABOUT THE AUTHOR

...view details