ఏపీలో అన్ని పంటలు కలిపి 6,17,837 మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా... 10వ వంతు మాత్రమే కొనుగోలు చేశారని నారా లోకేశ్ మండిపడ్డారు. తెలంగాణలో 5వేల కోట్ల రూపాయలతో పంటలను కొనుగోలు చేయగా... ఆంధ్రప్రదేశ్లో వెయ్యి కోట్లు మాత్రమేనని తెలిపారు. రబీలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా...5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. వేరుశనగ, పసుపు, పొగాకు, మొక్కజొన్న, జొన్న, కంది, శనగ ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని దుయ్యబట్టారు. గతేడాది మొక్కజొన్న క్వింటాలుకు రూ.2 వేల వరకు రైతుకు దక్కగా.. నేడు 1350 నుంచి రూ.1400కే కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. గ్రామస్థాయిలోనే రైతుల పంట ఉత్పత్తులను ఎందుకు కొనుగోలు చేయకూడదని నిలదీశారు. వాలంటీర్ దగ్గర నుంచి గ్రామ సచివాలయం వరకు 25 మంది వరకూ సిబ్బంది ఉన్నందున గ్రామస్థాయిలోనే పంటలను కొనుగోలు చేయాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
గ్రామస్థాయిలోనే పంట కొనుగోలు చేయాలి: లోకేశ్ - జగన్పై నారా లోకేశ్ విమర్శలు
మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ రైతుల వద్ద పంటలు కొనుగోలు చేయడంలో లేదంటూ ముఖ్యమంత్రి జగన్కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు అరకొరగా ఉన్నాయని పేర్కొన్న ఆయన... తక్షణమే గ్రామస్థాయిలో పంట ఉత్పత్తుల సేకరణ జరగాలని డిమాండ్ చేశారు.
lokesh letter to cm jagan on farmers