పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే.. తొలి ఆరు నెలల్లో ఏపీ రెండున్నర రెట్లుపైగా అప్పు చేసిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. తమిళనాడు. తెలంగాణ రాష్ట్రాలు కలిపి చేసినంత అప్పు... గత ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి రెవెన్యూ లోటు రూ. 16 వేల కోట్లు ఉంటే... ఈ ఆర్థిక సంవత్సరం ఆరు నెలలుకు ఇది రూ. 45,472 కోట్లుగా ఉందన్నారు. సెప్టెంబర్ నెలలో జగన్ ప్రభుత్వం రాష్ట్రంపై రూ. 8038 కోట్ల అప్పుభారం మోపిందని మండిపడ్డారు. కాగ్ నివేదిక జగన్ అప్పులను బహిర్గతం చేస్తోందని... ఆ వివరాలను విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో రూ. 55,189 కోట్లు అప్పు చేయగా... ఏడాదికి ఇది రూ. 1.11 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. ఐదేళ్ల తెదేపా ప్రభుత్వం చేసిన అప్పును జగన్ ఒక్క ఏడాదిలోనే చేస్తున్నారని దుయ్యబట్టారు.
'కాగ్ నివేదిక జగన్ అప్పులను బహిర్గతం చేస్తోంది'
తెదేపా ఐదేళ్ల పాలనలో చేసిన అప్పును జగన్ ఒక్క ఏడాదిలోనే చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. కాగ్ నివేదిక జగన్ అప్పులను బహిర్గతం చేస్తోందని విమర్శించారు.
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్