ముఖ్యమంత్రి జగన్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన కిషన్‌రెడ్డి దంపతులకు.. జగన్ - భారతి దంపతులు స్వాగతం పలికి సన్మానించారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా విజయవాడకు చేరుకున్న కిషన్‌రెడ్డి.. జగన్‌తో భేటీ అయ్యారు. అరగంటపాటు జరిగిన భేటీలో వివిధ అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు.
JAGAN-KISHAN REDDY MEET: ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి - ముఖ్యమంత్రి జగన్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ
15:01 August 19
ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కిషన్‌రెడ్డి దంపతులను సీఎం జగన్, భారతి దంపతులు సన్మానించారు. కిషన్‌రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి.. నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి...
kishan reddy: ఏపీ ప్రభుత్వం భాజపా శ్రేణులను వేధిస్తోంది: కిషన్‌రెడ్డి
cm jagan on Fake Challan Scam: ఏసీబీ దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా?: జగన్